కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా […]
గుంటూరులో జరిగిన ఘటన మర్చిపోకముందే.. మరో ప్రేమోన్మోదా ఘాతుకానికి పాల్పడ్డాడు.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రేయసిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఉన్మాది చర్యను అడ్డుకునేందుకు యత్నించిన ప్రేయసి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు… అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్స ఉంది.. […]
తాలిబన్లపై ఆది నుంచి అనుమానాలే.. వారు చెప్పేది ఒకటైతే.. చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఆఫ్ఘన్నిస్థాన్ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు.. ఇక యుద్ధం ముగిసిందని.. అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం.. మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి.. మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు.. ఆ స్టేట్మెంట్ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు.. అప్పడే.. డోర్‌డోర్ తనిఖీలు చేపట్టారు […]
భారత్‌లో మరోసారి స్వల్పంగా పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 36,571 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 530 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 39,157 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరగగా.. రికవరీ కేసులు 3,15,25,080కు […]
కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ […]
దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది… ఈ విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి… దర్భంగా పేలుడు ప్లాన్ లో నిందితులకు హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్టు తెలుస్తోంది.. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మాలిక్ సోదరులకు హవాలాతో హాజీ సలీం డబ్బు చేరవేసినట్టుగా తేల్చింది ఎన్ఐఏ… బట్టల వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసిన నాసిర్ మాలిక్‌కు యూపీ ఖైరానాకు చెందిన ఇక్బాల్ ఖానాను సంప్రదించాలని పలువురు సలహా ఇవ్వగా.. పదేళ్ల క్రితం పాకిస్థాన్ వెళ్లి […]
వరుసగా పెరుగుతూ సామాన్యుడికి భారంగా మారిపోయాయి పెట్రో ధరలు.. అయితే, గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతూ వస్తుండగా.. పెట్రోల్ ధరలు అలాగే ఉన్నా.. డీజిల్ ధరలు మాత్రం కాస్త మళ్లీ కిందికి దిగివస్తున్నాయి.. వరుసగా మూడో రోజు కూడా డీజిల్ ధర తగ్గింది.. ఇవాళ లీటర్ డీజిల్‌పై 25 పైసల మేర కోత పెట్టాయి ఆయిల్ సంస్థలు.. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27కి దిగివచ్చింది. పెట్రోల్ ధర రూ.101.84గా కొనసాగుతోంది.. […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో.. ప్రజలను భయపెడుతూనే ఉంది… తాజాగా, డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.. ముఖ్యంగా ఆసీస్‌లోని సిడ్నీ డెల్టా వేరియంట్ దెబ్బకు వణికిపోతోంది.. దీంతో మహమ్మారి కట్టడికోసం కఠినమైన నిబంధనలకు పూనుకుంటుంది ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ నిబంధనలను మరోమారు పొడిగించింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం… ఇక కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు. […]
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించినవారిపై జరిమానా విధించడమే కాదు.. నిబంధనలను ఉల్లంఘిచినవారికి నోటీసులు పంపడంపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం..దీనికి కోసం కేంద్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోటారు వాహన సవరణ చట్టాన్ని అనుసరించి… కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని 10 లక్షలు మించి జనాభా ఉన్న నగరాలకూ, నోటిఫికేషన్లో పేర్కొన్న […]
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు.. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ కిందికి దిగివస్తున్నాయి.. బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర పీపాకు 3 శాతానికి పైగా తగ్గి ఈ ఏడాది మే నెల కనిష్ఠ స్థాయి 66 డాలర్లకు జారుకుంది క్రూడాయిల్ ధర… దీనికి కారణం.. అమెరికాతోపాటు పలు దేశాల్లో కరోనా […]