ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం.. దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు… ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బస్వరాజ్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. హస్తినాపురంలోని తన పిన్ని దగ్గర ఆ యువతి ఉంటుండగా.. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. 3 నెలల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో.. కక్ష పెంచుకున్న బస్వరాజ్.. పథకం ప్రకారం యువతిపై దాడి చేశారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వేరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజు పొడిచాడు.. గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో పొడిచాడని బాధితురాలు తెలిపింది.
Read Also: కొత్త ప్రయాణం చేస్తున్న.. మీ ఆశీస్సులు కావాలి..
Also Read
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 48 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో చాలా రక్తస్రావం జరిగింది. 48 గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాం. మేజర్‌గా ఏమైనా గాయాలైనాయి అనేది స్కానింగ్ తర్వాత తెలుస్తుంది. సుమారుగా 18 గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్‌గా ఏమైనా గాయాలు ఉన్నట్లు తేలితే దాన్నిబట్టి చికిత్స చేస్తాం అన్నారు. మరోవైపు.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇప్పటికే నిందితుడు బస్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఇక, బస్వరాజ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు..
- Tags
తాజావార్తలు
-
Vihari: జూన్‌లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
-
NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
-
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
-
Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్‌కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
-
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!