ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం… కొన్ని అండకులు ఎదురైనా వేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో పదవి కాలం ఈ నెల 27వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. సీఈవోగా పోలవరం అదనపు బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించాలన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర సిబ్బంది నియామకాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా ఉన్న ఆయనకు కేంద్రం ఇదివరకే పీపీఏ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.