ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన […]
తాలిబన్లు అంటేనే చేతిలో గన్‌తో దర్శనమిస్తారు.. ఇక, వాళ్లకు కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా.. గన్నులనే వాడేస్తారు.. ఆప్ఘన్‌ను రాజధాని కాబూల్ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.. అక్కడ యుద్ధం ఓవైపు.. చర్చలు మరోవైపు సాగుతున్నాయి.. అయితే, త్వరలోనే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోన్న తాలిబన్లు.. పంజ్‌షేర్ కూడా తమ వశమైందని శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశారు.. దీంతో.. తాలిబన్లు అంతా ఆనందోత్సాహాలతో […]
కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గక ముందే.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. తిరిగి స్కూళ్లు, విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం… అయితే, అక్కడక్కడ వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ […]
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే ఒకేసారి సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందిని నియమించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 నియమించేందుకు సిద్ధమయ్యారు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.. చీఫ్ […]
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సాయంత్రం అయ్యిందంటే చాలు దంచికొడుతున్న వానలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. రేపు […]
ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం […]
ప్రేమ ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుందో తెలియదు.. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు చూశాం.. ప్రేమించినవాడి కోసం ఆస్తులు, అంతస్తులు త్యాగాలు చేసినవారు ఎందరో.. కన్నవారిని వదిలి కోరుకున్నవాడి కోసం పరితమింపే హృదయాలు మరెన్నో.. ఇదే కోవలోకి వస్తారు జపాన్ రాకుమారి మకో.. సామాన్యుడిలో లవ్‌లో మునిగిపోయిన ఆమె.. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు రాకుమారికి.. వివాహం సందర్భంగా రాజ కుటుంబం భారీగా డబ్బులు ఇవ్వడం అనవాయితి అట.. 1.2 మిలియన్ […]
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే, […]
గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం […]