గంజాయి వ్యవహారంపై గత కొంతకాలంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది.. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు… పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబట్టడం.. అవి ఏపీకి లింక్‌లు ఉన్నాయనే వార్తలతో ప్రత్యేకంగా గంజాయి నివారణ చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి.. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఎస్ఈబీ, పోలీసు శాఖ కలిసి ఇప్పటి వరకు 2,228 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు వివరించారు..
Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్.. అమెజాన్ ద్వారా గంజాయి..!
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని 58 గ్రామాల్లో రూ.626 కోట్ల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారని తెలిపిన ఆయన.. గిరిజనులు స్వచ్ఛందంగా 277 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు మొత్తంగా 2,505 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామని.. 153 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ పరివర్తన్ ను చేపట్టినట్టు వివరించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.