సోలార్ ప్లాంట్ పేరుతో రూ.12 కోట్లు కొట్టేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా.. ఎవరూ ఊహించని తరహాలో కొత్త తరహాలో కుచ్చుటోపీ పెట్టేస్టున్నారు.. తాజాగా.. సోలార్ ప్లాంట్ పేరుతో ఏకంగా రూ. 12 కోట్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.. ఈ కేసులో కీలకసూత్రధారిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్‌లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని నమ్మించిన ఖుర్షీద్ అహ్మద్… సౌదీలో ఉన్న తన బంధువు అల్తాఫ్ ద్వారా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశాడు.. అల్తాఫ్ తన స్నేహితులకు ప్లాంట్ గురించి వివరించి అధిక లాభాలు వస్తాయని నమ్మించి వారి వద్ద నుండి మొదట రూ. 2 కోట్లు పెట్టుబడిగా పెట్టించాడు.. అయితే, రెండేళ్ల తర్వాత ప్లాంట్ గురించి.. రాబడుల కోసం నిలదీశారు సౌదీ స్నేహితులు…
ఇక, ప్రభుత్వం ద్వారా నకిలీ పర్చస్ అగ్రిమెంట్ వచ్చిందని నమ్మించిన అహ్మద్.. అనంతరం కొన్ని నెలలు పెట్టుబడులు పెట్టిన వారికి నెల నెల 3 లక్షల రూపాయల చొప్పున చెల్లించాడు.. లాభాలు వస్తున్నాయని నమ్మిన అల్తాఫ్ .. మరికొంత మంది ద్వారా మొత్తం 11 మంది నుండి 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించాడు.. సౌదీ నుండి అల్తాఫ్ తెలంగాణ కు వచ్చి ప్లాంట్ చూడగా.. అక్కడ స్ట్రక్చర్ మాత్రమే ఉండడంతో.. ఖంగుతిన్నాడు.. వెంటనే సౌదీలో ఉన్న స్నేహితులకు విషయం చెప్పాడు.. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సౌదీ వారంతా..( ఖాజా మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ) ఆన్‌లైన్ ద్వారా అల్తాఫ్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. అల్తాఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. ఇక, కీలక నిందితుడు ఖుర్షీద్ అహ్మద్ పరారీలో ఉన్నాడు.
Also Read
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
తాజావార్తలు
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..