ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ […]
గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆ సభకు 2 లక్షల మంది వరకు వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు.. అయితే, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు? […]
త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు, […]
దేశవ్యాప్తంగా కొన్ని రోడ్లు బాగానే ఉన్నా.. మరికొన్ని రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి.. ఇక, ఈ మధ్య కురిసిన వర్షాలకు ఉన్న రోడ్లు కొన్ని కొట్టుకుపోతే.. మిగిలిన రోడ్లు దారుణంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు […]
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం […]
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన అధిష్టానం.. సీఎం అమరీందర్‌సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.. కానీ, ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి.. కొంత శాంతింపజేసినా.. అమరీందర్ సింగ్ ను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది.. కానీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అక్కడ అసమ్మతి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, ఈ నేపథ్యంలో […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. భారత్ వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తోంది.. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా కావడంతో.. శుక్రవారం దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.. ఒకే రోజు ఏకంగా 2.50 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.. కోవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2.5 కోట్లు దాటేసింది.. ఇక, ఒక రోజులో కోటికి […]
మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్ […]
ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.. ఏడాది కూడా చిన్నారిని ఎందుకు చంపడం అనుకున్నారో ఏమో.. 9 నెలల చిన్నారిని వదిలేసి అంతా ఉరివేసుకున్నారు.. కానీ, ఆ ఇంట్లో ఎవరూ లేరు.. ఏం చేయాలి..? ఏం తినాలి..? ఏమీ తెలియని ఆ చిన్నారి ఐదు రోజుల పాటు ఆకలితో అలమటించిపోయింది… ఇంట్లో వేలాడుతోన్న మృతుదేహాల మధ్య ఆకలితో అలమటించి.. ఏడుస్తూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.. ఈ ఘటనకు సంబంధించిన […]