హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎంపీపీ ఎన్నిక 24వ తేదీన జరగనుండగా.. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు 25వ తేదీన జరగనున్నాయి.. అయితే, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… క్లీన్‌స్వీప్ చేసింది.. అన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.. ఇదే ఊపులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.. వైసీపీ […]
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా? […]
తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంట్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సవాల్ విసిరితే.. ఆ సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు, […]
ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయిన ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 8 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 1,142 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో […]
దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం… దసరా మహోత్సవాల నిర్వహణపై ఇవాళ శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ అధికారులు.. అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్టు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత వెల్లడించారు శ్రీశైలం ఆలయం ఈవో లవన్న.. ఈ సమయంలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివనున్నారు శ్రీశైల భ్రమరాంబికా దేవి.. కోవిడ్ నిబంధనలతో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్టు లవన్న వెల్లడించారు.. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా […]
తెలంగాణలో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల.. ఇప్పుడు.. తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఆమె.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.. ఇప్పటికే ప్రతీవారం నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తూ వస్తున్న ఆమె.. ఇక, వచ్చే నెల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.. ఇవాళ తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు షర్మిల.. తన తండ్రి, […]
గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించిన డీఆర్ఐ అధికారులు.. కాకినాడ పోర్టు ద్వారా భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు.. ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్దీప్సింగ్ ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు.. జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్ రవాణా చేసినట్టు తెలుస్తోంది.. రాజస్థాన్‌కు చెందిన జయదీప్ లాజిస్టిక్ ద్వారా కాకినాడకు డ్రగ్స్ రవాణా చేసినట్టు గుర్తించారు.. తప్పుడు అడ్రస్‌లతో […]
రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.. తోటి విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కాల్పులకు తెగబడ్డాడు.. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, కాల్పులు జరుగుతోన్న సమయంలో.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. పై అంతస్తు నుంచి కిందకు దూకారు.. మరికొందరు విద్యార్థులు.. అలా కూడా కొంతమంది గాయాలపాలయ్యారు.