అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,120కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,220కి ఎగిసింది.. ఇక, బంగారం ధరలోనే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.65,300కి చేరుకుంది.. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా ఉండగా.. ముంబైలో రూ.46,780గా.. చెన్నైలో రూ.49,400గా, బెంగళూరులో రూ.45,120గా పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.