ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు […]
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్ […]
ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,720 శాంపిల్స్ పరీక్షించగా.. 1,365 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఎనిమిది మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 1,466 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,78,70,218గా […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు.. […]
మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయూ 2వ గేటు వద్ద విన్నాను.. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం […]
సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కావడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది.. అయతే, గతంలో వెలుగు చూసిన సీఎంఆర్ఎఫ్ కుంభకోణం విచారణలో స్పీడ్ పెంచింది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. సీఎంఆర్ఎఫ్ విభాగంలో కొంత మందిని గతంలోనే విచారించిన ఏసీబీ అధికారులు.. గతంలో జరిపిన విచారణకు హాజరు కాని మరొ కొందరు సిబ్బందని ఇప్పుడు ప్రశ్నిస్తోంది.. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ.. మరోవైపు.. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ […]
మరోసారి మద్యం షాపుల లైసెన్స్ గడువు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత పడటంతో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా మూతపడిన కారణంగా… బార్లు, వైన్స్‌ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్ […]
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కరోనా టెస్ట్‌లతో పాటు.. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఆదేశాలిచ్చింది.. కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వ్యాక్సినేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.. ఇక, విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సిన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ […]
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ […]
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో […]