బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజుకు చేరుకుంది.. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఇతర ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు బండి.. ఇక, ఇవాళ్టితో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.. మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల గంభీరావు పేట మండలంలోకి అడుగుపెట్టనున్నారు.. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది ప్రజా సంగ్రామ యాత్ర.. సిరిసిల్ల జిల్లాలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి […]
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 282 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 31,990 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,604 యాక్టివ్ కేసులు […]
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచితే… కొన్ని ప్రాంతాలకు టికెట్ ధర 186 రూపాయలు, ఇంకొన్ని ప్రాంతాలకు 204 […]
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, కోవిడ్‌కు ముందు వరుసగా విదేశీ పర్యటనలో ప్రపంచాన్ని చుట్టేసిన మోడీ.. విమాన ప్రయాణంలో సమయాన్ని చాలా ప్లాన్‌గా సద్వినియోగం చేసుకునేవారు.. ఒకసారి ఆయన.. కేవలం విమాన ప్రయాణంలో మాత్రమే రెస్ట్ తీసుకుంటూ.. వరుసగా మూడు దేశాలు చుట్టివచ్చిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, అమెరికాకు విమానంలో వెళుతున్న సమయంలోనూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ప్రధాని మోడీ… సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే […]
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి. […]
ఐపీఎల్ 2021 సైన్ రైజర్స్ తీరు మారడంలేదు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో రాణించినా, మనీశ్ పాండే బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా… గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత ఉన్నట్టుండి కేప్టెన్‌ను కూడా మార్చేసింది. ఆరు మ్యాచుల తర్వాత జట్టు కెప్టెన్‌ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు టైటిల్ అందించిన […]
ఈ మధ్య వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతూ పోతోంది.. హైదరాబాద్ మార్కెట్లో రూ.380 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,850కి ఎగబాకింది.. మరోవైపు.. వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. ఇవాళ రూ.1300 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర […]
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు డ్వాక్ర మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది వైసీపీ సర్కార్.. అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.. స్పందన కార్యక్రమం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం : ఈ రోజు మీకు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి. […]