కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రపంచాన్ని.. ఇప్పుడు హవానా సిండ్రోమ్ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఐఏ డైరెక్టర్‌కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై ప్రస్తుతం అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే వాహనా సిండ్రోమ్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేయనుంది. గత 20 రోజులుగా మనీలాండరింగ్ కేసలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్ ఖాతాలతో నటుల స్టేట్ మెంట్లను పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ విచారణలో ఇప్పటికే 16 మంది సెలబ్రిటీలకు క్లిన్ చిట్ దక్కింది. అయితే ఎక్సైజ్ విచారణతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు కొనసాగించింది. ఇక, ఇవాళ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ముగిసింది. […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది. […]
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి […]
ప్రజా సంగ్రామ యాత్రలో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే మెడలు వంచుతాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రంది అంటారంటూ ఫైర్ అయిన ఆయన.. లీటర్ పెట్రోల్‌పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ తీసుకుంటున్నారని.. మళ్లీ […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ […]
కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు […]
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు […]
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్ […]