డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశి విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. ఎదుటివారితో వీలైనంత మితంగా సంభాషించండి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం.
కన్య : ఈ రోజు ఈ రాశివారు కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
తుల : ఈ రోజు ఈ రాశివావారికి కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శించుకుంటారు. వస్త్ర వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కొంతమంది మీ నుండి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ యత్నాలకు బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!