అన్ని ఉచితం అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో… ఆ తర్వాత వరుసగా టారీప్ రేట్లను పెంచుతూ వచ్చింది.. కొన్ని సందర్భాలను మినహాయిస్తే.. జియోకు మంచి ఆదరణే ఉందని చెప్పాలి.. మరోవైపు.. అప్పడప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్లు తీసుకొస్తుంది జియో.. ఈ మధ్యే మరో సంచలన ప్రకటన చేసింది.. కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే మరోసారి సంచలనం సృష్టించింది.. అయితే ఒక్క రోజులోనే ఈ ప్లాన్‌పై వెనక్కి తగ్గింది.. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీ ప్రకటించిన 24 గంటల తర్వాత దాని ప్లేస్‌లో రూ. 1 రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అది కూడా కేవలం ఒకేరోజు అంటూ మరో ప్రకటన ఇచ్చింది.
Read Also: ఏపీ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్..
జియో తాజా ప్రకటన ఆ సంస్థ కస్టమర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.. అయితే, రూ.1కే 100 ఎంబీ డేటాపై జియో చేసిన ప్రకటన ఫేక్ అయిఉంటుందని కొందరు అభిప్రాయపడినా.. ఆ ప్రకటన చేసింది జియోనే… అది ఫేక్ కాదని స్పష్టమైంది.. టెలికం రంగంలోని ఇతర సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలతో జియో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.. అయితే, ఇప్పటికే ఎవరైనా రూ.1కే 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్ చేసుకుంటే మాత్రం.. ఆ ప్లాన్‌ను వర్తింపజేయనున్నట్టు వెల్లడించింది.. కానీ, ఇకపై జరిగే రీఛార్జ్‌లకు 10 ఎంబీ.. ఒకేరోజు మాత్రమే వర్తించనుంది.