ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.. ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు. అయితే, […]
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు కామెంట్లు చేయడం.. దానికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడం.. మధ్యలో పోసాని మురళి ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇటు సినిమా పరిశ్రమలో కొంత టెన్షన్ నెలకొంటే.. పొలిటికల్ కామెంట్లు మాత్రం ఓ రేంజ్లో పేలుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్.. మంత్రిని.. ఆ మంత్రి తిరిగి పవన్‌ని దూషించడం అంతా ఒక గేమ్ అని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ […]
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటున్నారు.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల కోసం పనిచేస్తోంది. ఇవాళ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో భేటీ […]
సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాన్ని.. మంత్రులు పవన్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ఇక, సినీ దర్శక నిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. పోసానిని పవన్ అభిమానులు టార్గెట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పోసాని ప్రెస్‌మీట్ పెట్టి.. మెగా ఫ్యామిలీని, పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై […]
తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక, దసరా కంటే ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దసరాను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. బతుకమ్మల సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోంది.. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం […]
ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ […]
ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్హయ్య కుమార్‌కు […]
బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా […]
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న […]
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహారాష్ట్రలో వర్షాల కారణంగా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వాగు వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్‌ను అలాగే పోనించాడు డ్రైవర్.. అయితే, వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బస్సు కొట్టుకుపోయింది.. ఇక, స్థానికులు అప్రమత్తం అయ్యి.. బస్సులో ఉన్న ఇద్దరిని రక్షించినట్టు […]