తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు […]
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ […]
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్ బయోటెక్ సంస్థ కోవిగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది… భారత్‌లో ఈ టీకాను విస్తృతంగా వినియోగిస్తుండగా.. ఇతర దేశాలకు కూడా ఈ టీకాను ఎగుమతి చేశారు.. కానీ, కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ఇప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియరెన్స్ వచ్చేలా కనిపించడంలేదు.. ఎందుకంటే.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తాజాగా కొన్ని ప్రశ్నలు వేసింది డబ్ల్యూహెచ్‌వో.. వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతికరపరమైన అంశాలపై భారత్ బయోటెక్ నుంచి మరికొన్ని […]
ప్రముఖ ట్రావెల్స్ సంస్థ సదరన్ ట్రావెల్స్‌ను తెలంగాణ స్టేట్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు వరించింది.. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు.. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పురస్కారాలను ప్రదానం చేశారు.. “బెస్ట్ ట్రావెల్ ఏజెంట్” విభాగంలో సదరన్ ట్రావెల్స్‌ను అవార్డు వరించింది.. సంస్థ ప్రతినిధులు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. ఇక, ఈ […]
గులాబ్ తుఫాన్ తెలంగాణలో విధ్వంసమే సృష్టిస్తోంది… ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుగా ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇక, అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.. భారీ వర్షాల వల్ల […]
ఏ ప్రభుత్వం అయినా.. కోర్టుల నుంచి మొట్టకాయలు పడకుండా.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి.. ఏదైనా కొత్త పథకం తెచ్చే సమయంలో.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో.. దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది..? అనే దానిపై కూడా సమాలోచనలు చేసి ముందుకు వెళ్తుంటారు.. అయితే, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.. అయితే, త్రిపుర సీఎం బిప్లబ్ దేవ్ మాత్రం.. అవి ఏమీ పట్టించుకోవద్దు అంటూ వివాదాస్పద […]
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవగా.. ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.. అయితే, తెలంగాణలో భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు. […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. […]
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రేపు సెలవుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉండడంతో.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అయితే, అత్యవసర సేవలకు సంబంధించినవారు మాత్రం విధుల్లో ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్‌తో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.. ఇక, రేపు అసెంబ్లీ సమావేశాల్లో.. సభను నిర్వహించడంపై […]
దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా.. కేరళలో మాత్రం పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కోవిడ్ కేసులు హాట్‌స్పాట్‌గా మారిపోయింది కేరళ.. అయితే, ఇవాళ మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గాయి.. కేరళ సర్కార్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,699 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 58 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒకే రోజులు 17,763 మంది […]