ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సర్వర్ మొరాయించింది.. వచ్చే ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి.. దీంతో రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఇవాళ రాత్రికి వెబ్ సైట్లో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని.. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. ఏపీ రవాణా శాఖ సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.. T/R ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని.. సాఫ్ట్‌వేర్ ను సరిచేసే పనిలో ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు..
Read Also: ఏపీ, తెలంగాణకు కేంద్రం లేఖ.. విభజన సమస్యలపై చర్చిద్దాం రండి..
సర్వర్ డౌన్ కావడంతో వాహన కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పేర్నినాని.. డిసెంబర్ 31లోపు వాహనం కొన్న ఇన్వాయిస్ ఉంటే, ఇన్సూరెన్స్ కట్టిన పేపర్ ఉంటే ఈ ఏడాది ట్యాక్స్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.. CFMS వెబ్ సైట్ లో యజమాని పేరు, ఛాయిస్ నంబర్ నమోదు చేసి ట్యాక్స్ పే చేసుకోవచ్చు అని కూడా వెల్లడించారు.. జనవరి 1వ తేదీ తర్వాత కూడా ఇవి ఉన్న వాహనాలకు 2021 ఏడాది ట్యాక్స్ కే రిజిస్ట్రేషన్ చేస్తామని.. ఈ విషయాన్ని డీలర్లు, రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే తెలియజేశామని పేర్కొన్నారు మంత్రి పేర్నినాని.