మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం […]
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. దీంతో, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం.. అసలు ఈ నిధుల గోమాల్కు ప్రధాన కారణం ఏంటి? అనేతి తేల్చింది త్రిసభ్య కమిటీ.. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్ మాల్ కు ప్రధాన కారణం అని తన నివేదికలో పేర్కొంది త్రి సభ్య కమిటీ.. తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు అన్ని బ్యాంకులలో కలిపి రూ.340 కోట్లు ఉండగా.. మూడు బ్యాంక్ […]
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. తెలుగు అకాడమీ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలిని కస్టడికి అనుమతించింది నాంపల్లి కోర్టు.. రేపటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీలోకి అనుమతించింది కోర్టు.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న మస్తాన్ వలీని రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు సీసీఎస్ పోలీసులు. మరోవైపు నిధుల గోల్డ్ మాల్ పాలడ్డ ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేశారు […]
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్.. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉండాల్సిందే.. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అంతా ఎక్కువ సమయం సోషల్ మీడియాపైనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.. కానీ, సోమవారం సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్న ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ స్తంభించిపోయాయి.. తరచూ వాట్సప్ చెక్ చేసుకుంటూ.. ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవారికి ఈ పరిణామం చాలా ఇబ్బంది కరంగా మారింది… మళ్లీ మళ్లీ ఆ యాప్స్ […]
ప్రతీ ఏడాది లాగే.. ఈ సంవత్సరం కూడా నోబెల్ ప్రైజ్ ప్రకటించారు.. ఇవాళ భౌతిక శాస్త్ర నోబెల్ ప్రకటన వెలువడగా… సంక్లిష్ట భౌతిక వ్యవస్థపై మన అవగాహనకు సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తలు స్యుకురో మనాబె, క్లాస్ హాసెల్మాన్, గియోర్గియో పారిసిలను ఫిజిక్స్ నోబెల్ వరించింది.. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.. ఇక, నోబెల్ బహుమతితోపాటు ఇచ్చే ప్రైజ్‌మనీలో సగం పారిసికి, మిగతా సగం మానబె, హాసెల్‌మాన్‌లకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. […]
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్‌లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన […]
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులకు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. తెలుగు దేశం పార్టీలో ఉండగానే టీఆర్ఎస్లో చేరేందుకు అప్పట్లో మోత్కుపల్లి ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది.. కానీ, ఆయనను పార్టీలో చేర్చుకోవడం కొందరికి ఇష్టం లేకపోవడంతో.. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.. అయితే, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించగానే.. పరిస్థితి మారిపోయింది… సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం […]
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్… ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ నింధులు అందగా… హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దళిత బంధు నిధులు విడుదల చేశారు.. ఇదే సమయంలో… రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కూడా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్… అయితే, దళిత బంధుకు నిధులు ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం ప్రతిపక్షాలను తొలచివేస్తున్నాయి.. ఈ తరుణంలో దళితబంధుపై అసెంబ్లీ […]
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా […]
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు… అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై వివరణాత్మకంగా మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త జోనల్ వ్యవస్థ ల్యాండ్ అవుతుంది.. ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్.. అనేది తేల్చుతామన్న సీఎం కేసీఆర్… నెల, రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని వెల్లడించారు. ఇక, […]