కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది… అయితే, కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ ముందుగా పోటీపడి స్వదేశాలకు, సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి భారీగా ఖర్చు చేశారు.. ఆ సమయంలో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. అన్ని దేశాలు ఆంక్షల బాట పడుతున్న సమయంలో.. విమానాలు ఎక్కేవారు లేక.. చార్జీలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో.. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు పడిపోయాయి.. సాధారణ సమయాల్లో దుబాయ్ నుంచి భారత్‌కు రావాలంటే కనీసం 1500 దిర్హమ్స్ అంటే రూపాయాల్లో సుమారుగా రూ.30 వేలుగా ఉండేది.. కానీ, ప్రస్తుతం అది 300 దిర్హమ్స్ అంటే సుమారు రూ.6వేలకు పడిపోయింది.. అంటే భారత్-యూఏఈ మధ్య ఏకంగా 4-5 రేట్లు విమానచార్జీలు పడిపోయాయి..
Read Also: కాపులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..
భారత్ యూఏఈ రూట్‌లో టికెట్ బుకింగ్స్ కూడా భారీగా తగ్గినట్టు ట్రావెల్ పోర్టల్ చెబుతున్నమాట.. వారం ముందు వరకు రోజువారీగా చూస్తే 142 వరకు బుక్సింగ్ ఉండేవి.. కానీ, ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది ఈజీ మై ట్రిప్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్‌కు గతంలో 1000-1500 దిర్హమ్స్‌గా అంటే రూ.20వేలు నుంచి రూ.30వేలుగా ఉన్న విమాన చార్జీలు ఇప్పుడు కేవలం 330 దిర్హమ్స్ అంటే రూ.6600కు పడిపోయిందని పేర్కొంది. కొచ్చి నుంచి దుబాయ్ టికెట్ ధర రూ.26 వేల నుంచి రూ.10 లోపునకు, తిరువనంతపురం నుంచి దుబాయ్‌కు చార్జీలు రూ.81 వేలు నుంచి 8 వేలుకు, కన్నూర్, కోజికోడ్ నుంచి దుబాయ్‌కు రూ. 28 వేల నుంచి రూ.10 వేలకు ఇలా.. చాలా రూట్లలోనూ చార్జీలు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం.. కోవిడ్ నిబంధనలే అని చెబుతున్నారు.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నెషనల్ ప్రయాణికులకు విధించిన పెయిడ్ ఐసోలేట్ నిబంధన.. విదేశాల నుంచి వచ్చినవారికి పాజిటివ్ వస్తే తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని నిబంధన.. తదితర అంశాలు కూడా టికెట్ రేట్లపై ప్రతీకూల ప్రభావం చూపుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తంగా.. మునుపెన్నడూ లేని విధంగా భారీగా తగ్గిన విమాన చార్జీలు ఇలా కూడా రికార్డు సృష్టించాయి.