వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్… కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్‌పై చర్చించారు.. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఆరా తీసిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం […]
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్‌తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ […]
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్లో ప్రత్యేక బస్సులను […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేకపోగా… థర్డ్ వేవ్ ముప్పు ఉందనే ముందస్తు హెచ్చరికలు కూడా ఉన్నాయి.. కానీ, బయట చూస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. కాస్త కేసులు తగ్గుముఖం పట్టగానే.. నిబంధనలు గాలికొదిలేసి ప్రజలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.. అయితే, కోవిడ్ 19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా […]
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. 17 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఇద్దరిని మినహాయించి 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు […]
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి […]
దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించారు… అయితే, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అవమానిస్తారా? అంటూ ఫైర్ అయిన ఆయన.. సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన… […]
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 72, 500 బోనస్ చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి ప్రకటించింది.. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది.. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది.. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) 72,500 […]
ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతవాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించింది.. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనుంది సర్కార్.. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్.. దీంతో.. సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కనుంది. ఇక, […]
నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. పరీక్ష నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై మండిపడింది… పాత సిలబస్ ప్రకారం టెస్ట్ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు […]