మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు […]
ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి.. కానీ, ఆయన్ను కూడా మోసం చేశారు రంటూ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్… కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడు.. ఆయన్ను కూడా మోసం చేసింది కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు.. కేసీఆర్ అయన […]
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక […]
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ శాఖ సమావేశం కానుంది.. ఈ భేటీకి జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు.. హైదరాబాద్ అజీజ్ నగర్‌లోని జీపీఎల్ కన్వెన్షన్ 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకం సాగుతోంది.. ఈ […]
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. చైనా ప్రస్తావన వస్తేనే ఫైర్ అయ్యేవారు.. ఇక, కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత.. అది చైనా వైరస్ అంటూ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి… అయితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరగొచ్చు అంటూ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఓవైపు తైవాన్ గగనతలంలో చైనా యుద్ధ విమానాల దూకుడు పెంచిన సమయంలో.. ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. చైనాతో అగ్రరాజ్యం అమెరికా యుద్ధం చేసేలా […]
భారీ వర్షాలు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పొట్టన బెట్టుకుంది.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం తాలూకాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బదల అంకాలగిలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూప్పకూలింది.. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు కన్నుమూశారు.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న […]
లఖింపుర్ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర […]
పండగ సీజన్ పురస్కరించుకుని హోండా కార్స్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై 53వేల 500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఫిప్త్ జెన్ సిటీ కారు మోడల్‌పై 53వేల 500, ఫోర్త్ జెన్ సిటీపై 22వేలు , అమేజ్‌పై 18వేలు, DWR – V పై 40వేల 100, జాజ్‌పై […]
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,161 శాంపిల్స్ పరీక్షించగా… 187 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 170 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,158కు చేరుకోగా… రికవరీ కేసులు 6,58,827కు పెరిగాయి.. ఇక, మృతుల […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్.. ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు.. ఇక, అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆమె.. మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ […]