కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సిన సమయంలో.. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. అయితే, గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, తన ప్రాజెక్టులను తెలంగాణ అప్పగించిన తర్వాతనే ఈ జీవో అమల్లోకి తేవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ […]
తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. పాలక, ప్రతిక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. నువ్వా నేనా అనే పరిస్థితి హుజురాబాద్‌లో కనిపిస్తోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్.. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే […]
దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా…? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక […]
తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. కౌహ్సియుంగ్ లో ఇవాళ ఉదయం 13 అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాప్తించాయి.. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 41 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు అధికారులు.. కౌహ్సియుంగ్లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.. గురువారం వేకువజామున మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాప్తించాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపిల్స్ పరీక్షించగా.. 540 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, చిత్తూరులో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఇదే సమయంలో 557 మంది […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి తెరదింపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు.. కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే పరిస్థితి కనిపించడంలేదు.. ఇవాళ్టి నుంచి గెజిట్ అమల్లోకి రావాల్సి ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీగా ఆసల్యం చేసేపనిలో పడిపోయాయి.. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్ టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ మొదలుపెట్టాలని […]
భారత్-పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఇక, తాజాగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు భారతీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే కాగా.. పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన ఆయన.. దాడులను ఏమాత్రం సహించబోమని […]
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని.. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో కూడా సర్వే పూర్తి కానున్నట్టు సీఎంకు తెలిపారు.. ఇక, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. […]
హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య ఘటన కలకలం సృష్టించింది.. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళ్తున్న హమీద్ అనే వ్యక్తిని వెంబడించిని గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న హమీద్‌ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.. అయితే, […]