పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ ప్రకటించింది.. ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం మాత్రం.. రవిదాస్ జయంతియే కారణంగా చెబుతున్నారు.. ఫిబ్రవరి 16వ తేదీన రవిదాస్ జయంతి ఉండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.. ఇది.. పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. ఓటింగ్‌కు చాలా మంది దూరమయ్యే అవకాశాలు లేకపోలేదంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెళ్లాయి.. అంతే కాదు.. ఈ విషయమై ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా.. ఈ నెల 13వ తేదీన లేఖ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలియజేశాయి.. దీంతో.. ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను 20వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.
Read Also: కరోనాపై సీఎం సమీక్ష.. బూస్టర్ డోస్‌పై కేంద్రానికి విజ్ఞప్తి