BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్‌కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?
- ఎన్డీయే గూటికి విజయ్ పార్టీ..
- డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్..
- తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు(ఆదివారం) షెడ్యూల్ ప్రకటించనుంది. ముఖ్యంగా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే, షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు తమిళనాడు వ్యాప్తంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ అయిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) చేరుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు విజయ్, బీజేపీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వర్గాల ప్రకారం.. ఒక వేళ కూటమి ఎన్నికల్లో గెలిస్తే విజయ్‌కు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతామని బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సీట్ల ఒప్పందంలో భాగంగా విజయ్ పార్టీకి సుమారు 80 అసెంట్లీ సీట్లను బీజేపీ ఆఫర్ చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఒక వేళ ఈ చర్చలు విజయవంతమై, పొత్తు కార్యరూపం దాలిస్తే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల విజయావకాశాలు కొద్ది పాటి ఓట్ల శాతంతో మారిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ కీలకం కాబోతోంది. అయితే, టీవీకే వర్గాలు మాత్రం విజయ్ ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి సారించినట్లు చెబుతున్నాయి. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు దారి తీస్తోందని తెలుస్తోంది.
నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ ఈ రోజు ఢిల్లీలో సీబీఐ ముందు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై ఈ లీకులు రావడం రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. తమిళనాట విజయ్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ప్రజాదృష్టిని ఆకర్షించింది. దీంతో విజయ్‌ను తమ కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అనేక మార్గాలను అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..