యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్ దాడులకు తమ పనేనని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు నిర్వహించారు.. ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. తాజా దాడుల్లో.. మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.. యూఏఈ యొక్క కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలంలో మంటలు సంభవించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు.
Read Also: కరోనాపై సీఎం సమీక్ష.. బూస్టర్ డోస్‌పై కేంద్రానికి విజ్ఞప్తి