మూడు రాజధానుల ఆంశంపై మరోసారి విచారణ జరిపింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది.. ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకున్నా మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొనడంతో విచారణ కొనసాగించాలని న్యాయవాదులు కోరారు. పిటీషన్లలో ఏ అంశాలపై విచారణ కొనసాగించాలో అఫిడవిట్‌లు దాఖలు చేయాలని గతంలో త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, నిర్మాణం నిలిపివేసిన పనులు కొనసాగించడం, రైతుల ప్లాట్‌లను అభివృద్ధి చేయడం, రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై వాదనలు నడిచాయి.. మొత్తం 70 పిటిషన్లపై వాదనలు కొనసాగాయి.. ఇక, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Read Also: నూతన పీఆర్సీపై విచారణ.. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ చేసిన హైకోర్టు