ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ నిర్వహిస్తూ వస్తోంది ఎగ్జిబిషన్ సొసైటీ.. అయితే, కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ నుమాయిష్‌పై కూడా పడింది… ఈ సారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. కరోనా థర్డ్ వేవ్ విజృంభించడం.. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడంతో మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది.. కానీ, కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం.. క్రమంగా ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో మళ్లీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.. ఈనెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ పునఃప్రారంభం అవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.. కాగా, జనవరి 1వ తేదీన ప్రారంభమైన నుమాయిష్.. కోవిడ్ ఆంక్షల కారణంగా జనవరి 3వ తేదీ నుంచి మూసివేశారు.. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలిగించడంతో మళ్లీ నుమాయిష్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Bhuma Akhila Priya: రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ.. మీరు సిద్ధమా..?