ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం… కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ నిబంధన తొలగిస్తున్నట్టు వెల్లడించారు.. కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు.. అయితే, మాస్క్ ఆంక్షలు కొనసాగాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఇక, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Surgical Strike: కేసీఆర్‌కు అస్సాం సీఎం కౌంటర్.. ఇదిగో సాక్ష్యం..!
ఇక, కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని, సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. ఆస్పత్రుల్లో పాలనా, చికిత్స బాధ్యతలను వేర్వేరు చేయాలని స్పష్టం చేశారు.. పాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలన్న ఆయన.. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని.. స్పెషలిస్టు వైద్యులకు బేసిక్ పేలో 50 శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా.. మార్గదర్శకాలు సిద్ధం చేసినట్టు తెలిపారు సీఎం వైఎస్ జగన్.