Alliance: కాంగ్రెస్‌కే అతి గతి లేదు.. వాళ్లతో పొత్తా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం.. ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడంతో… మళ్లీ కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా సీఎం కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదన్న ఆయన.. అస్సాం ముఖ్యమంత్రి కామెంట్స్ పై మాత్రమే మాట్లాడారని గుర్తు చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీకే అతి గతి లేదు.. వాళ్లతో మాకు పొత్తు ఏంటి? అని ప్రశ్నించారు.
Read Also: YS Jagan: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఆ సొమ్ము ఖాతాల్లోకి..
Also Read
ఇక, తెలివి లేని మంత్రులు కేంద్రంలో ఉన్నారని మండిపడ్డారు తలసాని.. బీజేపీ వాళ్లు ఎక్కువ మాట్లాడితే మీ సంగతి ఏమి అవుతుందో చూసుకోండి? అని హెచ్చరించిన ఆయన.. మీరు పనికి రాని చేత గాని దద్దమ్మలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ అంటే ప్రధాని మోడీకి కుళ్లు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.. ఈక్వాలిటీ గురించి తెలియని ప్రధాని మోడీ.. రామానుజ విగ్రహ ఆవిష్కరణకి వచ్చి మాట్లాడతాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఆర్మీని కూడా రాజకీయాలకు వాడుకున్న పార్టీ బీజేపీయే అని.. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు..
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!