ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రోజువారి కేసులు.. కాస్త కిందికి పైకి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,663 శాంపిల్స్ పరీక్షించగా.. 675 మందికి పాజిటివ్‌గా తేలింది… దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,14,502కు చేరింది.. మరోవైపు, ఒకే రోజులో ముగ్గురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. దీంతో.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,405కు పెరిగింది.. ఇక, గడిచిన 24 గంటల్లో 2,414 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోగా.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 22,88,989కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,808 యాక్టివ్ కేసులు ఉండగా.. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 143, పశ్చిమ గోదావరిలో 130 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,28,93,908 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఆంధప్రదేశ్ ప్రభుత్వం.
Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు.. 24 గంటల డెడ్‌లైన్..!