విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.. 5వ నంబర్ బస్ రూట్‌లో… ఆంధ్ర హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన వచ్చిన ఓ మహిళ.. తన వాహనానికి ఆర్టీసీ బస్సు తగిలిందంటూ ఓవర్ యాక్షన్ చేశారు.. వచ్చిందే రాంగ్ రూట్.. పైగా బస్సు డ్రైవర్‌పై రుబాబు చేసింది ఆవిడి.. బస్సు ఎక్కి మరీ డ్రైవర్‌పై దాడికి దిగింది.. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా.. డ్రైవర్‌ను పిడిగుద్దులు గుద్దింది.. కాళ్లతో తంతూ వీరంగం సృష్టించింది.. అయితే, ఆ మహిళను అప్పుడే అదుపులోకి తీసుకున్న సూర్యారావుపేట పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు.. అయితే, ఈ కేసులో ఈ రోజు ఆ మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
Read Also: Kishan Reddy Letter to KCR: పీఎం మిత్రలో చేరండి..
గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యాధరపురం డిపోకు చెందిన ఐదో నంబర్ రూట్ బస్సు సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ నుంచి ఆటోనగర్‌కు బయలుదేరింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన నందిని ఆమె మహిళ తన ద్విచక్ర వాహనంపై వన్ వేలో రాంగ్‌రూట్‌లో కేఎల్ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో డ్రైవర్ ముసలయ్య అత్యవసర బ్రేకు వేసి ప్రమాదం జరగకుండా బస్సును అదుపు చేశారు. కానీ, ఆగ్రహంతో ఊగిపోయిన నందిని.. చంపేస్తావా అంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడికి దిగింది.. డ్రైవర్‌ను నానా బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో దాడి చేసింది.. అయితే, మరో వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఫోన్‌లో వీడియో తీశారు.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.. వీడియో దృశ్యాలను పరిశీలించారు.. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందినిపై కేసు నమోదు చేశారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.