EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు.. 24 గంటల డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. హిందువులందరూ ఏకం కావాలి.. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చిన ఆయన.. ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయనివారంతా ద్రోహులు అని.. వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని పేర్కొన్నారు.. ఇక, యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చిన ఆయన.. యోగీకి ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని.. ఇప్పటికే వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని.. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామని హెచ్చరించారు.. అయితే, రాజా సింగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం..
Read Also: PRC Issue: విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి చర్చలు..
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
యూపీలోని ఓటర్లను తమ పార్టీకి ఓటు వేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడినందుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్‌కు ఈసీ నోటీసులు పంపింది.. ఐపీసీ, ఆర్‌పీ చట్టం మరియు ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది… దీని కోసం ఎమ్మెల్యే రాజా సింగ్‌కు 24 గంటల సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్.. కాగా, ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశతో పాటు గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో మిగిలిన దశల్లో పోలింగ్ జరగనుంది.. ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
- Tags
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!