కరోనా సమయంలో పూర్తిగా నిలిచిపోయాయి రైల్వే సర్వీసులు.. కొన్ని ప్రత్యేక సర్వీసులు తప్ప.. మిగతా ఏ రైలు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు.. అయితే, సాధారణ పరిస్థితులు వస్తున్న తరుణంలో క్రమంగా అన్ని సర్వీసులను తిప్పుతున్నారు.. ఈ తరుణంలో ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది… జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీ కోచ్‌లలో మంటలు అంటుకోగా.. ఆ తర్వాత క్షణాల్లోనే మరో […]
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.. అధికార టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్నారు.. అయితే, బీజేపీకి అంత సీనేలేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఆరిపోయే దీపం..! బీజేపీకి 80 సీట్లు కాదు […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్న ఆయన.. కేసీఆర్ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని జోస్యం చెప్పారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల… కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు… కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారంటూ […]
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెబుతోంది… మొబైల్ యూజర్లకు.. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా సందేశాలను ఫ్రీగా అందించే ప్రతిపాదన తన ముందు ఉన్నట్టుగా చెబుతోంది. అది అమలైతే ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం దక్కనుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను కూడా పూర్తిగా ఫ్రీగా అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికం ఆపరేటర్లు […]
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్ […]
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా, కరీంనగర్ మాజీ మేయర్, 51 డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు… ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు రవిందర్ సింగ్… టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో ఆరోపించారు మాజీ మేయర్.. కాగా, స్థానిక […]
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి కేంద్ర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి ఓ అంచనాకు రానున్నారు.. రేపు రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత జిల్లాల్లో పర్యటించనుంది.. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప జిల్లాలు, […]
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ అవార్డుల పంట పండింది… స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులు దక్కాయి… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు స్వచ్ఛ అవార్డులు పొందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన మేయర్లు, కమిషనర్లు… పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సీఎం జగన్ ను కలిశారు.. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఏపీ సీఎం అభినందించారు.. ఇంకా […]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. ప్రస్తుతం వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు.. ఇక, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు ఇప్పుడు క్రమంగా తిరుమలకు వెళ్తున్నారు.. నవంబర్ నెల ముగుస్తుండడంతో.. డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది టీటీడీ.. Read Also: ఏపీ వరి ధాన్యానికి బ్రేక్‌లు..! సరిహద్దులో అడ్డుకున్న తెలంగాణ అధికారులు.. […]
వరి కొనుగోళ్ల వ్యవహారం ఇప్పటికే తెలంగాణ సర్కార్, కేంద్రం మధ్య నిప్పు రాజేసింది.. మార్కెట్ యార్డులతో పాటు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది.. దయచేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మొర్రో అంటూ రైతులు వేడుకున్నా ఫలితం దక్కని పరిస్థితి ఉంది.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు.. Read Also: చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..! అయితే, రాష్ట్ర సరిహద్దుల్లో ఆ లారీలను అడ్డుకున్నారు తెలంగాణ అధికారులు.. […]