RIP Mekapati Goutham Reddy: రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో భౌతికకాయం తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించనున్నారు.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయన హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.. గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని వైద్యులు ప్రకటించారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని.. ఆస్పత్రికి వచ్చేసరికే స్పందించని స్థితిలో ఉన్నారని తెలిపారు.. అయితే, రేపు ఉదయం ఆర్మీ హెలికాప్టర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించి.. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. ఇక, ఎల్లుండి ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర సాగనుండగా.. ఎల్లుండి మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు..
Read Also: Anil Kumar: సొంత అన్నను కోల్పోయినట్టు ఉంది.. వివాదాలులేని వ్యక్తి మేకపాటి..
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఎల్లుండి ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు మేకపాటి గౌతమ్‌రెడ్డి అని గుర్తుచేశారు.. సీఎం జగన్‌తో అత్యంత సన్నిహితుడుగా ఉన్నారని.. ఈరోజు అయన లేరు అని విషయాన్ని నమ్మలేకపోతున్నాం అన్నారు.. ఎల్లుండి ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఇస్తామని తెలిపిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!