ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠన్మారణంతో ఏపీ విషాదంలో మునిగిపోయింది.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనవుతున్నాయి… సీఎం వైఎస్ జగన్ సహా.. మంత్రులు, నేతలు.. హైదరాబాద్‌కు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.. మేకపాటి భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ కూడా వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి అని పేర్కొన్న ఆయన.. ఎప్పుడూ నవ్వే వ్యక్తి ఆయన అని గుర్తుచేసుకున్నారు.. మా జిల్లాలోని సమస్యలపై కొద్ది రోజుల క్రితం చర్చించుకున్నామని.. ఆయన మరణం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా జిల్లాకు తీరని లోటు అన్నారు.. మా ఇద్దరినీ ఎప్పుడు అంటారు.. ఇద్దరం ఫిట్‌గా ఉంటామని.. కానీ, ఆయన ఇలా కన్నుమూయడంతో మాటలు రావడం లేదన్నారు.. ఇక, రేపు నెల్లూరులో పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి అక్కడ పార్థివదేహాన్ని ఉంచుతామని ప్రకటించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
Read Also: Revanth Reddy: జగ్గారెడ్డి మా నాయకుడు.. మేమంతా అండగా ఉంటాం..