సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా విస్తరిస్తూ వస్తోంది.. ఇప్పటికే 12 దేశాలను చుట్టేసిన ఈ మహమ్మారి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను సైతం తాకింది.. గత నెల 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్ ప్రకటించింది. నవంబర్ 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చాడు ఆ వ్యక్తి.. అయితే, 29వ తేదీన అతడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చినట్టు […]
భారీ వర్షాలతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇక, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి.. తిరుమల ఘాట్ రోడ్డులు కోతకు గురయ్యాయి.. ఏకంగా 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో.. తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇవాళ తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించనుంది ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం. Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. […]
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది… కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు మరో తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది.. ఇప్పటికే ఆ తుఫాన్‌కు ‘జవాద్ తుఫాన్’గా నామకరణం చేశారు అధికారులు.. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారబోతోంది.. జవాద్ ఎఫెక్ట్‌తో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. అయితే, […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం […]
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది నీతి ఆయోగ్ బృందం.. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్.. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననుండగా.. ఇవాళ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలిశారు. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు నీతి ఆయోగ్ వైస్ […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై […]
పెట్రోల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్… పెట్రోల్‌పై ఇప్పటి వరకు ఉన్న వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు భారీగా తగ్గనున్నాయి… ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 వరకు తగ్గనుంది. కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తాయని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. Read Also: ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. […]
రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన […]
ప్రంపంచదేశాలను వణికిస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో.. మరోసారి ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.. ఇప్పటికే 14 దేశాలను చుట్టేసింది కొత్త వేరియంట్.. దీంతో అన్ని దేశాలు నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. వ్యాక్సిన్ వేసుకున్నా, టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్‌తో వచ్చినా.. మళ్లీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. దేశ పౌరులు, వలసదారులకు కువైట్ సర్కార్ కీల ఆదేశాలు జారీ […]