Vijayashanti: శివుడు మూడో కన్ను తెరుస్తాడు.. కేసీఆర్ సంగతి తేలుస్తాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అని ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు.. అందుకు రూ. 700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు.. దేవుడి విషయంలో అబద్ధం ఆడాడు.. మీరు అని నేను ఆనను.. కేసీఆర్‌ను నీవు అని పిలుస్తానన్నారు రాములమ్మ. భక్తులకు ఇక్కడ ఏ సదుపాయాలు లేవు.. గుడి చిన్నగా ఉంది… భక్తులు ఎక్కువగా వస్తున్నారు.. చిన్న పిల్లలు, ముసలివాళ్లు ఇబ్బంది పడుతున్నారన్న ఆమె.. అభివృద్ధి చేయండి అంటే అరెస్ట్‌లు చేయడం ఆయన నైజం అంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kishan Reddy: ఆందోళన వద్దు.. సురక్షితంగా భారత్‌కు తీసుకొస్తాం..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
వేములవాడ ఎమ్యెల్యేను గెలిపించారు… కానీ, ఏం చేశాడని నిలదీశారు రాములమ్మ.. జిల్లా మంత్రి ఉన్నాడు ఏం లాభం.. సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదన్న ఆమె.. హిందుగాళ్లు బొందుగాళ్లు అని కేసీఆర్ అన్నారని గుర్తుచేస్తూ మండిపడ్డారు.. కేసీఆర్ నీవు హిందువా? లేక ముస్లింవా? అని ప్రశ్నించిన ఆమె.. కేసీఆర్ తన తప్పులను ప్రధాని నరేంద్ర మోడీపై నెట్టడం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. ఇక, నరేంద్రమోడీ రాముడి గుడి కడుతున్నాం.. మీకు తోచిన సహాయం చేయండి అన్నారు తప్పా? అని ప్రశ్నించిన రాములమ్మ.. ప్రపంచం మొత్తం మోడీని మెచ్చుకుంటున్నారు… కానీ, కేసీఆర్‌కి నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.. ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. కేసీఆర్ సంగి తేలుస్తాడని వ్యాఖ్యానించిన ఆమె.. బీజేపీ ఉన్నది హిందూ ధర్మాన్ని కాపాడడానికి.. తెలంగాణ ప్రజలకు బీజేపీ రక్షణగా ఉంటుందన్నారు.. కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయానికి ఇస్తానన్న 700 కోట్లు ఇవ్వు, లేకపోతే మేం ఊరుకోం అని హెచ్చరించారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి