భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది బయటకు రావడం.. దానిలోని తమ ఫ్యామిలీ ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని.. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి.. అతని […]
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో […]
హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు పోలీసులు, భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… డ్రగ్స్ ముఠాను నడుపుతోన్న ముంబై మాఫియాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు ఆ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా గుర్తించారు.. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఈ ముఠా నుంచి కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను సీజ్ చేశారు నార్త్ జోన్ టాస్క్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా పీఆర్సీపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దీనిలో భాగంగా పలు మార్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేవాలు నిర్వహించారు.. తాజాగా, బుధవారం రోజు కూడా భేటీ జరిగింది.. అయితే, ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు.. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి ఆయా […]
భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.. రోజువారి కేసుల సంఖ్య మళ్లీ 90 వేలను దాటేసింది.. ఇదే సమయంలో.. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది. Read Also: టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24 […]
యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. తగ్గినట్టే తగ్గిన కోవిడ్ మళ్లీ పంజా విసురుతుండగా.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు బాటపడుతున్నాయి.. కోవిడ్ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం […]
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా రేషన్ […]
కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కార్.. కోవిడ్‌పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతోన్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. మరోవైపు, జమ్ములోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అక్కడ వైద్య […]