AP: వంట నూనెల ధరలకు సర్కార్ బ్రేక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ ఏది జరిగినా.. దాని ప్రభావం మనపై పడే అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు.. వెంటనే బ్లాక్‌మార్కెట్ దారులు మేల్కొంటున్నారు.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలకు షాక్ ఇస్తున్నారు.. అయితే, సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్ విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధికధరల విక్రయానికి చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు కూడా చౌకధరల దుకాణాల్లో కొనాలని సూచించింది. ఇకపై నూనె వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న స్టాకును స్వాధీనం చేసుకుని తక్కువ ధరకు విక్రయించనున్నారు. అంతేకాదు హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు కేంద్రప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయనున్నారు అధికారులు.
Read Also: Traffic Challan: ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన..
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంట నూనె ధరలకు బ్రేక్ వేసేందుకు వంట నూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అయినప్పటికీ కొంత మంది కావాలనే ధరలు పెంచి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించి, ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంటే దాన్ని పాత ధరలకే అమ్మాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ…అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!