కుల మతాలకతీతంగా సాంప్రదాయాలను పాటిస్తూ చేసుకునే పండగ హోలీ.. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు. కానీ గత రెండేళ్లుగా ప్రజలు కోవిడ్ కారణంగా హోలీ జరుపుకోలేదు. ఈసారి పరిస్థితి మారింది. రంగులతో వీధులన్నీ సందడిగా మారాయి. ఇక, రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకుంటారని పేర్కొన్న ఆయన.. ‘‘ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం..