రేటు పెరిగినా.. రేటు తగ్గినా.. బంగారానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. ఇక, బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవాళ పసిడి ధరలు మరింత పైకి కదులుతూ బ్యాడ్ న్యూస్ చెప్పాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది.. ఇదే సమయంలో.. వెండి రేటు కూడా పెరిగింది.. కిలో వెండి రూ. 600 పెరిగి రూ. 72,900కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం.. బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించి 1942 డాలర్లకు తగ్గింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 25.53 డాలర్లకు పడిపోయింది.
Read Also: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఆ ఎమ్మెల్యేదేనా..?