ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఓ వింత పరిస్థితి ఇప్పుడు అధికార బీజేపీకి ఎదురైంది.. ఎందుకంటే.. ఒకేస్థానం కోసం ఓవైపు మంత్రి ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరోవైపు.. అదే స్థానం కోసం.. ఆమె భర్త కూడా తీవ్రంగా ప్రయత్నించడం ఇప్పుడు చర్చగా మారింది.. అదే సరోజనీనగర్ అసెంబ్లీ స్థానం.. ఈ స్థానంకోసం సీఎం యోగి ఆదిత్యనాద్ కేబినెట్లోని మంత్రి స్వాతి సింగ్, ఆమె […]
డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలని ఆదేశించారు.. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. ఇక, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్.. దీని కోసం ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ, […]
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది.. అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడి.. మొత్తంగా జిల్లాల సంఖ్య 26కు చేరుకోబోతోంది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.. 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను సీఎస్‌కు అందజేశారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్.. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక, […]
ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. పద్మ అవార్డుల తుది జాబితాకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో.. ఆ జాబితాను ఇవాళ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.. నలుగురికి పద్మవిభూషన్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి.. అందులో మొగిలయ్య ఒకరు.. ఆయనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు […]
భారత్‌లో అత్యున్నత పౌర పురస్కరాలైన పద్మ అవార్డులు ఖరారయ్యాయి… 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.. ఆ జాబితాను రాష్ట్రపతి భవనం ఇవాళ విడుదల చేసింది.. ఆ జాబితాలో నలుగురికి పద్మవిభూషన్ అవార్డులు, 17 మందికి పద్మభూషన్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఇక, ఏ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.. మొత్తంగా ఏడుగురు తెలుగువారు పద్మ అవార్డులు దక్కించుకున్నారు.. […]
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. కోవిడ్ దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి.. మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నా.. విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి.. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి.. అయితే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారినపపడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీనిపై ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విద్యార్థులు, […]
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2017లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.. బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనలో ఏకంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.. దీనికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత కావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ ఘటనలో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, దీనికి బాధ్యున్ని చేస్తూ డాక్టర్ కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు.. ఆయన చివరకు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది.. […]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి.. ఆదిలోనే అధికార బీజేపీ పార్టీని దెబ్బ కొడుతూ.. ముగ్గురు మంత్రులను, 10 మందికి పైగా ఎమ్మెల్యేలను సమాజ్‌వాదీ పార్టీలో చేర్చుకున్నారు అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత ములయాంసింగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి.. ఆ కుటుంబంలోని ఇద్దరికి బీజేపీ కండువా కప్పారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూనే ఉంది బీజేపీ.. ఇప్పటికే పలువురు కీలక నేతలకు కండువా కప్పారు.. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. […]
టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.. జట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గడ్డపై ఆడలేకపోయారో.. లేక కోవిడ్ టెన్షన్ ఏమైనా పట్టుకుందో తెలియదు కాని.. మన వాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఓటమిపాలయ్యారు.. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. చివరిదైన మూడో వన్డేలోనూ భారత్‌కు అవకాశం ఇవ్వలేదు.. కాకపోతే, ఈ మ్యాచ్ టీమిండియా గొప్ప ఆటతీరును కనబర్చింది.. ఒక రకంగా చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది.. Read Also: […]