త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ తర్వాత పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. కానీ, అంతర్గత కుమ్మలాటలతో బయటకు వెళ్లిపోయి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.. ఇక, పీఎల్సీ అధ్యక్షుడు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ […]
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల పార్లమెంబ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రెండు విడతలగా బడ్జెట్ సెషన్ జరగబోతోంది.. అయితే, పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.. దీనిపై బడ్జెట్ 2022-2023లో క్లారిటీ రాబోతోంది.. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ […]
హైదరాబాద్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. చార్మినార్, గోల్కొండ, జంట జగరాలను కలపే హుస్సేన్‌సాగర్ అందాలు కనువిందు చేస్తాయి.. ఇక, శివారు ప్రాంతాల్లోనే మరికొన్ని స్పాట్లు కూడా ఆకట్టుకుంటాయి.. త్వరలో హైదరాబాదీలు, పర్యాటకులకు అసలైన థ్రిల్ అందించేందుకు సర్కార్ సిద్ధం అవుతోంది.. రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో రాబోతోంది.. పీవీఎన్ఆర్ మార్గ్‌లో అంటే నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ మీద ఈ ఏడాది చివరికల్లా ఆ […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిక పరిణామాలు జరుగుతున్నాయి.. అన్నీ తానై ముందుడి యూపీ కాంగ్రెస్ బాధ్యతలను భుజానవేసుకుని ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా.. ఇప్పటికే బీజేపీ, ఎస్పీ సీఎం అభ్యర్థులు తేలిపోవడంతో.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రశ్నగా మారింది.. ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వరకు చేరింది.. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో కాంగ్రెస్ సీఎం […]
భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీతో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. భారీగా స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. కానీ, నిన్నటి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు తగ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 19 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 3,37,704 మందికి […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖలు రాస్తూ వస్తున్న ఆయన.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని తన లేఖలో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక, గత ప్రభుత్వం […]
మరోసారి థర్డ్‌వేవ్ రూపంలో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో కాస్త పరవాలేదు అనిపించినా.. లేదా ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా.. సడలింపులు పెంచుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు.. తాజాగా, కరోనా కట్టడి కోసం విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది.. రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో హోం శాఖ, ఆరోగ్యశాఖ, విద్యా శాఖ, జలవనరుల […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే, వైరస్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం.. ఎందుకంటే.. వీరి నుంచి మరికొందరికి ఈ మహమ్మారి సోకుతూ పోతోంది.. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ […]
తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో […]