ఇప్పుడు ఎక్కడా చూసినా.. చిన్న నుంచి పెద్ద వరకు.. సందర్భం ఏదైనా కావొచ్చు తగ్గేదే లే అంటూ డైలాగ్ వదులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మధ్యే విడుదల పుష్ఫ సినిమా ఎఫెక్టే.. కథ, కథనం, మాటలు, పాటలు, డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ మాత్రం అందరి నోళ్లలో నానుతోంది.. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అన్నట్టు అంతా పుష్ప మేనియాలో […]
భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సుభాష్ చంద్రబోస్ నినాదాన్ని గుర్తుచేసుకున్నారు.. ఏదైనా సాధించగలం అనే నేతాజీ నినాదాన్ని అందరూ ప్రేరణగా తీసుకోవాలని.. ఆయన ప్రేరణతో దేశసేవకు అంకితం […]
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ […]
బెస్ట్ టీ20 క్రికెటర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. కాగా, 2021లో టీ-20ల్లో చెలిరేగి పోయాడు రిజ్వాన్.. 29 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ ప్లేయర్.. 73.66 సగటుతో 1,326 పరుగులు చేశాడు.. స్ట్రయిక్ రేట్ 134.89 సాధించాడు.. బ్యాటింగ్‌లోనే కాదు.. మరోవైపు వికెట్ కీపర్‌గానూ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కోవిడ్ పాజివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, మరోసారి విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో రోజువారి కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ కేసుల నమోదులో మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది వైజాగ్.. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగానే వెలుగు చూశాయి.. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. […]
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.. ఆదిలోనే అధికార బీజేపీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజకీయ వలసలకు తెరలేపారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. దీంతో షాక్ తిన్న కమల దళం.. తేరుకుని.. అఖిలేష్ ఫ్యామిలీ నుంచి వలసలను ప్రోత్సహించింది.. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఇద్దరికి బీజేపీ కండువా కప్పింది.. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. మొదటగా భారతీయ జనతా […]
భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరోసారి కరోనా మహమ్మారి బారినపడ్డారు.. స్వల్ప లక్షణాలు ఉండడంతో.. తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినిట్టు.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. కాగా, వెంకయ్యనాయుడుకి […]