కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్ […]
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తలపై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులు వెనక్కి రావాలని కోరింది భారత విదేశాంగ శాఖ.. ఇక, భారత పౌరులను తరలించేందుకు చర్యలను కూడా ప్రారంభించింది.. ఇవాళ రాత్రి ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానం రానుంది. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి బోయింగ్ 787 విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానంలో 200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగిరానున్నారు. ఇక, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్.. ప్రస్తుతం జరుగుతున్న […]
వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది […]
భారత్‌లో కరోనా ఉధృతి తగ్గింది.. క్రమంగా రోజువారీ కేసుల సంఖ్య దిగివస్తోంది.. తాజాగా ఆ సంఖ్య 14 వేల కిందకు పడిపోయింది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 13,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 235 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 34,226 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది. ప్రస్తుతం యాక్టివ్ […]
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే […]
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వేస్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సర్వీస్‌ను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్సీటీసీ, ఎన్‌పీసీఎల్, సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి. ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి.. గరిష్ట పొదుపును అందించేందుకు ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. అయితే కార్డు జారీ అయిన 45 రోజులలోపు వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు […]
కరోనాకు మరో టీకా అందుబాటులోకి వస్తోంది. బయోలాజికల్-ఈ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్అత్యవసర అనుమతికి డ్రగ్స్కంట్రోలర్ జనరల్ ఆఫ్ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. 12-18 ఏళ్ల పిల్లలకు రెండు డోసులుగా ఈ టీకాను వేస్తారు. 5 కోట్ల కార్బెవాక్స్ డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును 145 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనం. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. Read Also: […]
ఉత్తరప్రదేశ్‌లో నాలుగోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక నాలుగో దశ ఎన్నికల్లో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్‌బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ […]
ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే […]