రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్. Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ […]
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది… భారత్‌కు చెందిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారని కేంద్రం తేల్చింది.. అందులో 4 వేల మంది వరకు ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మిగతావారిని రప్పించే ప్రయత్నాల్లో ఉంది.. భారత ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉండడంతో.. ప్రత్యేకం హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం […]
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో తాను తాండూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.. పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతేకాదు.. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. […]
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త […]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, ఇతర సమస్యలపై సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది… మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్‌స్టార్ మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను కలవడం.. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయాయి.. ఇక, త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు.. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం […]
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ […]
రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. అయితే, రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. రష్యా తమపై […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సినిమాను తొందరగా చూడాలన్న ఆతృతతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అవకాశం లేకపోవడంతో… సమీప ప్రాంతాలకు తరలివెళ్లి సినిమా చూస్తున్నారు.. బెనిఫిట్ షోలు వేయకుండా సినిమా హాళ్ల యాజమాన్యాలను ముందుగానే హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. జీవో నంబర్ 35 ప్రకారమున్న ధరలనే వర్తింప చేయాలని నోటీసులు జారీ చేశారు.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు రెవెన్యూ అధికారులు. దీంతో.. విజయవాడ […]
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా… రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. కీవ్‌ను చుట్టుముట్టాయి రష్యా బలగాలు, కీవ్‌కు వెళ్లే రోడ్లు అన్నింటినీ దిగ్బంధించాయి రష్యా సేనలు… ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.. ఇప్పటి వరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా.. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్పౌరులు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. […]
సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపత దేవస్థానం (టీటీడీ).. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది… సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది… వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి… ఇక, శుక్ర, శని, […]