టీటీడీ పాలకమండలి సమావేశం రేపు జరగబోతోంది.. 64 అంశాల అజెండాతో పాటు టేబుల్ ఆజెండాగా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.. వారపు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ, దివ్యదర్శనం టోకెన్లు పునః ప్రారంభం, వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల పై నిర్ణయం తీసుకోనున్నారు. గరుడ వారధి, శ్రీవాణి ట్రస్టు విరాళాలతో నూతన ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయింపు, స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల సౌకర్యార్ధం షెడ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు, ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌తో పాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు, ఆప్కో మెగా షోరూం ఏర్పాటు, ఇళ్లు, దుకాణాలు లీగల్ హైర్, కొనుగోలు చేసిన వారి లైసెన్సుల క్రమబద్ధీకరణ.. చాలా ఏళ్లుగా వివాదంలో ఉన్న 84 టెండర్ షాపుల కేటాయింపు, యాక్సిస్ బ్యాంకు ఈ-లాబీ ఏర్పాటు, అన్నమయ్య మార్గంలో నడకదారీ, రోడ్డు మార్గం ఏర్పాటుపై అటవీశాఖ నివేదిక పై చర్చించనున్నారు.
Read Also: GVL Narasimha Rao: ఏపీకి కాదు యూపీకి పంపండి.. ధైర్యం చేస్తారా..?
ఇక, అటవీశాఖ సిబ్బందికి టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకోనుంది టీటీడీ పాలకమండలి.. టీటీడీలో ఖాళీగా వున్న క్వార్టర్స్ ను కార్పోరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలోని టీటీడీ క్వార్టర్స్ మరమ్మత్తులకు నిధులు కేటాయింపు, శ్రీవారి మొట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావడంపై ఓ నిర్ణయానికి రానున్నారు.. మరోవైపు, 300 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్ ను 5వ తేదీన ప్రారంభానికి సీఎంను ఆహ్వానించనుంది టీటీడీ. ప్రిడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎంచే భూమి పూజ చేయించనున్నారు. దేశవాళీ గోవుల సేకరణ పై నిర్ణయం తీసుకుంది టీటీడీ.