మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూశారు.. అతని వయస్సు 26 సంవత్సరాలు.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల మరణించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.. 26 ఏళ్ల జైన్ సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. జైన్ జన్మించినప్పటి నుంచే సెరిబ్రల్ పాల్సీని ఎదుర్కొంటున్నాడు.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. జైన్ మరణించినట్లు సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. Read […]
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి.. […]
మరోసారి గ్యాస్ ధరలు పెరిగాయి.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. అయితే, దీని వెనుక కూడా ఓ లాజిక్ […]
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను క్రమంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, వచ్చే వారం ఐక్యరాజ్య సమితి సాధారాణ సభలో ఓటింగ్ ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరగబోతోంది.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ ఉండనుంది.. అయితే, రెండోసారి కూడా తటస్థ వైఖరినే అవలంభిస్తోంది భారత్.. ఇక, ఐక్యరాజ్య సమితిలోని 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది […]
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ రియాల్టర్ గాయాలపాలయ్యాడరు.. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపాడు రియాల్టర్.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో ఉన్న స్కార్పియోకు రక్తం మరకలు గుర్తించారు.. అయితే, దీనిపై భిన్నకథనాలున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో కారు అదుపుతప్పినట్టుగా కూడా చెబతున్నారు.. ఒకరికి తీవ్రగాయాలు […]
ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసి చలానాలు వేసుకున్నవారికి గుడ్న్యూస్ చెబుతూ.. భారీ డిస్కౌంట్తో క్లియర్ చేసుకోవడానికి అవకాశం కలిపించింది ప్రభుత్వం.. కొన్నిసార్లు ఆ చలానాలు కట్టలేక వాహనాలను వదిలేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ చలానాలు ఉన్నవాళ్లకి ట్రాఫిక్ పోలీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన ప్రత్యేక డ్రైవ్కు […]
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని […]
ఉక్రెయిన్లో ఆరో రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. మరో రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ నగానికి 40 మైళ్ల దూరంలో రష్యా మిలెట్రీ కాన్వాయ్ ఉంది. దీనిపై శాటిలైట్ ఫోటోలు విడుదలయ్యాయి.. పుతిన్ సేనలు ఏమాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ […]
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు చర్చలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే కాగా.. నిన్న జరిగిన మొదటి విడుదల చర్చలు విఫలం అయ్యాయి.. ఉక్రెయిన్లోని నగరాలపై క్రమంగా పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని చోట్ల తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.. ఇక, రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.. ఇక, రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస వెళ్తున్నారు.. దీంతో.. సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ […]
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి… ఫిఫా ప్రపంచకప్ 2022 నుంచి రష్యాపై బహిష్కరణ వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ).. అన్ని అంతర్జాతీయ టోర్నీల నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది. దీంతో.. రష్యాకు క్రీడలపరంగానూ భారీ దెబ్బ తగిలినట్టు అయ్యింది.. అంతర్జాతీయ టోర్నీల్లో రష్యన్ జట్లను అనుమతించొద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.. అంతే కాదు.. రష్యాకు […]