జమ్మూ- కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు బాగా తగ్గాయి. అయినప్పటికీ, ప్రస్తుతం పాక్ నుంచి 200 మంది ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. కశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా పరిస్థితులను ఆయన వివరించారు. పర్వత ప్రాంతాలు, అడవుల గుండా మాత్రమే కాకుండా జమ్మూ, పంజాబ్, నేపాల్ మీదుగానూ చొరబాట్లు జరుగుతున్నాయన్నారు. అయితే.. వాటిని అడ్డుకునే యంత్రాంగం పటిష్ఠంగా ఉందని, అన్ని రిజర్వ్ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు.
Read Also: Ramakrishna: వైఎస్సాఆర్ ఆశయానికి జగన్ మంగళం..!
విదేశీ ఉగ్రవాదులతోపాటు రహస్య ప్రాంతాల్లో ప్రస్తుతం 40 నుంచి 50 మంది స్థానిక ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 21 మందిని మట్టుబెట్టారు.. శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య స్థానికంగా క్రమంగా తగ్గుతోంది. యువత అతివాద భావజాలంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిషేధిత సంస్థల్లో టీనేజర్లు ఎక్కువగా భర్తీ అవుతున్నారు.అయితే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు ఉపేంద్ర ద్వివేది. మరోవైపు, సరిహద్దుల్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయ్. ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 చిన్నపాటి క్యాంపులు ఉన్నాయి. వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక లాంచింగ్ ప్యాడ్‌లూ ఉన్నాయి. మొత్తానికి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకదలికలపై మరింత దృష్టిసారించింది ఆర్మీ.