Chandrababu: తప్పుడు కేసులు పెట్టినవారిపై దర్యాప్తు చేయిస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. అయితే, ఇది కక్షపూరితమని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతుంటూ.. ఆధారాలున్నాయి కాబట్టే కేసులు పెడుతున్నాం, అరెస్ట్‌లు చేస్తున్నామని చెబుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరు నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు.. తప్పుడు కేసులు పెట్టిన వారిపై దర్యాప్తు చేయిస్తా.. తప్పుడు కేసులు వెనుక ఏ స్థాయి అధికారి ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు.
Read Also: Global Covid Summit- Modi: సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత.. డబ్ల్యూహెచ్ఓ రూల్స్ సరళం చేయాలి
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఇక, మహిళల మీద ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. నేను బాధితులను పరామర్శించడానికి వెళ్తే మహిళ కమిషన్ పేరుతో నా మీదే కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ మహిళ కమిషన్ ఏర్పాటు చేసిందే నేనంటూ గుర్తుచేసుకున్నారు. నాకే చట్టాలు నేర్పిస్తారా..? అంటూ మండిపడ్డారు.. తీవ్రవాదుల మీద పోరాడాను, అసాంఘిక శక్తుల గుండెల్లో నిద్రపోయాను… ఈ సీఎం తప్పుడు కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదన్నారు చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!